సారథి న్యూస్, భద్రాచలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజయ్య మృతికి తెలంగాణ సీఎం […]