సారథి న్యూస్, రామగుండం: గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.31,405 విలువైన మద్యాన్ని సీజ్‌చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా బెల్టుషాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేఖర్, మహేందర్, […]