ముంబై: పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించాలనే పట్టుదలతోనే బీసీసీఐ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యలు అలా వచ్చాయే లేదో.. ఐపీఎల్ కోసం తాత్కాలిక షెడ్యూల్‌కు అనుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు లీగ్‌ను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే టీ20 ప్రపంచకప్ అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత, ఇతర అంతర్జాతీయ టోర్నీలను చూసుకుని ఈ తేదీల్లో కాస్త మార్పులు చేసే […]
న్యూఢిల్లీ: ఆటగాళ్లు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలు పెట్టకపోవడం, దేశంలో కరోనా అదుపులోకి రాకపోవడంతో.. బీసీసీఐ మరో కీలకనిర్ణయం తీసుకుంది. లంక పర్యటన దారిలోనే.. జింబాబ్వే టూర్‌ను కూడా రద్దుచేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 22వ నుంచి జింబాబ్వేతో కోహ్లీనే మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే కరోనా ముప్పు కారణంగా ఈ పర్యటన నుంచి వైదొలుగుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. భవిష్యత్లోనూ దీనిని కొనసాగించే అవకాశాల్లేవన్నారు. మరోవైపు క్రికెటర్ల ఔట్ డోర్ […]
న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్‌లను భవిష్యత్‌లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్, జులైలో జరగాల్సిన లంక టూర్ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]
ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్‌కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని […]
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు.. ఐసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. దాదా అంతర్జాతీయ బాడీ పగ్గాలు చేపడితే చాలామంది క్రికెటర్లకు న్యాయం జరుగుతుందన్నాడు. అత్యున్నత స్థానాన్ని చేపట్టేందుకు గంగూలీకి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. తనపై పాక్ బోర్డు విధించిన జీవితకాల నిషేధాన్ని కూడా ఐసీసీలో అప్పీల్ చేస్తానన్నాడు. ‘నా విషయంలో దాదా తప్ప మరెవరూ న్యాయం […]
ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్‌గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం […]
న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. విదేశాలకు తరలించడంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తమ ముందున్న చివరి ప్రత్యామ్నాయం అదేనని బోర్డు వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ మొదటి ప్రాధాన్యం మాత్రం భారతే అని స్పష్టం చేశాయి. ‘మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. క్రికెటర్ల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉండి, ప్రభుత్వం అనుమతి ఇస్తే లీగ్ ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో, సరైన విండో లభిస్తే […]
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్‌ను మొదలుపెట్టడం. ఇందుకు […]