ప్రశ్నిస్తున్న బాలకేంద్రాల్లోని పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు 20 ఏళ్ల సీనియారిటీ.. రూ.3వేలు, రూ.4వేల జీతాలే పిల్లల ఆటాపాటలు, బహుమతులకు డబ్బులు కరువు ‘తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డబ్బులకు కొదవలేదు..’ 6వ విడత హరితహారం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట ఇది.. ‘మేం ప్రతి జాతీయ పండగను ఘనంగా జరుపుకుంటాం. పిల్లల చేత నాటికలు, నాటకాలు, ఏక పాత్రాభినయాలూ చేయిస్తాం. మహనీయుల పుట్టిన రోజులు, ప్రముఖుల వర్ధంతుల సందర్భంగా […]