న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్‌రత్న అవార్డు కోసం.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్.. క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడంతో విమర్శలు చేసిన హెచ్ఎస్ ప్రణయ్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్ షిప్ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్‌లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్‌ను […]
సిద్ధమైన వరల్డ్ ఫెడరేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో బ్యాడ్మింటన్‌ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో బ్యాడ్మింటన్ క్రీడ మొదలుకానుంది. నవంబర్ 17–22వ తేదీ వరకు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఇండియా ఓపెన్‌కు డిసెంబర్ 8న తెరలేవనుంది. ఓవరాల్‌గా ప్రధానమైన […]