జైపూర్, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్ రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌లోని రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]
జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్ పైలెట్ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. రాజస్థాన్ అనిశ్చితి తర్వాత గెహ్లాట్ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్ గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు […]