Breaking News

ASHOK GEHLOT

అశోక్​ గెహ్లాట్​ నెగ్గాడు

బలపరీక్షలో నెగ్గిన అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్​ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్​ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

Read More
అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

జైపూర్​: సచిన్​ పైలట్​ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్​ గెహ్లాట్​కు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) సమన్లు జారీచేసింది. అగ్రసేన్​ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్​ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్​కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు […]

Read More
సుప్రీం కోర్టుకు రాజస్థాన్​పంచాయితీ

సుప్రీం కోర్టుకు రాజస్థాన్​ పంచాయితీ

న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌‌ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్‌ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ వేయాలని మా లాయర్‌‌ను కోరాను. హైకోర్టు […]

Read More
సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

జైపూర్‌‌: అశోక్‌ గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్‌ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్‌ సీరియస్‌ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరూ రూ.ఫైన్‌ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్‌ ఆరోపించారు. గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ […]

Read More
నా ప్రభుత్వం కూల్చాలని చూస్తున్నారు

నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు

జైపూర్‌‌: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్‌ గేమ్స్‌ ఆడుతోందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్‌‌ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషీ ఎస్‌వోజీ, ఏసీబీ ఆఫ్‌ రాజస్థాన్‌ పోలీస్‌కు కంప్లయింట్​ చేశారు. ‘దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు […]

Read More