ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్‌ఘర్ రేషన్ యోజన’ పథకం కింద రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.