Breaking News

ANDRAPRADESH

సాక్షిగణపతికి విశేష అభిషేకం

సాక్షిగణపతికి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి […]

Read More
అక్కాచెల్లెళ్లు ఆర్థికంగా ఎదగాలి

అక్కాచెల్లెళ్లు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సాయం అందజేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్​చేయూత’ పథకాన్ని సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి బుధవారం క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. సుమారు 23 లక్షల మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నగదుబదిలీ చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.4,687 కోట్లు ఖర్చుచేస్తారు. ఇంకా మహిళలకు ఆదాయం సమకూర్చేలా అమూల్, పీ అండ్‌ జీ వంటి సంస్థలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ […]

Read More
ఏపీలో 9,597 కరోనా కేసులు

ఏపీలో 9,597 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం […]

Read More
కరోనాను కట్టడి చేయడంలో విఫలం

కరోనాను కట్టడి చేయడంలో విఫలం

సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ​బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు. కరోనా క్వారంటైన్ […]

Read More
‘వైఎస్సార్ చేయూత’ మహిళలకు వరం

‘వైఎస్సార్ చేయూత’ మహిళలకు వరం

సారథి న్యూస్, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు దశలవారీగా రూ.75వేలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. మహిళలకు మొదటి విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున మొత్తం 9,949 మంది లబ్ధిదారులకు రూ.18.65కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు […]

Read More
అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్​చేయూత

అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్ ​చేయూత

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో సుమారు 23లక్షల మంది అక్కాచెల్లెళ్లకు నాలుగేళ్లలో రూ.17వేల కోట్ల ఆర్థికసాయం వైఎస్సార్​చేయూత పథకం ద్వారా అందుతుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఈ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 […]

Read More
కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

అమరావతి: కృష్ణానది నీటి పంపకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై మంగళవారం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని వివరించారు. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని గుర్తుచేశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని వివరించారు. […]

Read More
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరానికి సమీపంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వాగులు, వంకలను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఆరువేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరిందన్నారు. హంద్రీనీవా నదిలో […]

Read More