సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.