Breaking News

AIRPORT

బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​

సారథి న్యూస్​, రామగుండం: బసంత్​నగర్​లో ఎయిర్ట్​పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్​నగర్​ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం […]

Read More

జీవీకే కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జీవీకే గ్రూప్​ అధినేత జీవీ కృష్ణారెడ్డి, అతడి కుమారుడు సంజయ్​రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణలో వీరు అవకతవకలకు పాల్పడ్డట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ. 705 కోట్ల మేర వీరు అక్రమాలకు పాల్పడ్డట్టు సమాచారం. ముంబై విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం జీవేకే సంస్థ మియాల్​తో ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా 2017లో బోగస్​ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సమాచారం.

Read More