సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో ఏదైనా విపత్తులు, ఇళ్లు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే సమాచారం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో […]