Breaking News

ACB

ఏసీబీకి చిక్కిన సీఐ

సారథిన్యూస్​, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్​ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్​ పీఎస్​లో శంకరయ్య యాదవ్​, ఏఎస్సై రాజేందర్..​ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]

Read More

ఏసీబీకి చిక్కిన అధికారి

సారథిన్యూస్​, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో​​​- ఆర్డినేటర్​గా పనిచేస్తున్న రఘునాథ్​ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్​ హాస్పిటల్​ను రెన్యువల్​ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్​ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్​ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్​.. లంచం తీకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More

రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ మహిళా వీఆర్వో

సారథిన్యూస్​, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్​హ్యండెడ్​గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్​ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్​ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.

Read More

షేక్ పేట్ తహసీల్దార్​ భర్త సూసైడ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్​పేట తహసీల్దార్​ సుజాత భర్త అజయ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్​లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్​ చేసుకున్నాడు.

Read More

ఏసీబీ వలలో పెద్దఅంబర్ పేట్ కమిషనర్

సారథి న్యూస్, ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీసీపీ సూర్యానారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామానికి చెందిన సురభి వెంకట్ రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణ అనుమతుల విషయంలో కమిషనర్ రవీందర్ రావు బాధితుడు వెంకట్ రెడ్డిని రూ1.5 లక్షలు డిమాండ్ చేయగా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం […]

Read More