Breaking News

TELANGANA

హైదరాబాద్..​ ఎవడబ్బ జాగీరు కాదు!

సారథిన్యూస్​, హైదరాబాద్​: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్​లోని అల్వాల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతబస్తీలో కొందరు బీజేపీ మద్దతుదారులను, హిందువులను ఇబ్బంది పెడుతున్నారని అటువంటి వారి చేతులు నరికేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను భారతీయ జనతాపార్టీ కాపాడుకుందని చెప్పారు. హైదరాబాద్​ ఎవడబ్బ జాగీరు కాదు అంటూ మండిపడ్డారు. త్వరలో జరుగబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజా […]

Read More
తెలంగాణలో 2,392 కరోనా కేసులు

తెలంగాణలో 2,392 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]

Read More
వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్​వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్​ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ […]

Read More
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020 ను ఆమోదించింది. ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020ను ఆమోదించింది. అలాగే తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు-2019లోని సవరణ బిల్లుకు […]

Read More
వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్’ కట్​

వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్​’ కట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా వేగవంతంగా కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు రికార్డులు అప్పగించాలని, ఈ మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని సూచించింది. సోమవారం సాయంత్రంలోగా […]

Read More
తెలంగాణలో 1,802 కరోనా కేసులు

తెలంగాణలో 1,802 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) కొత్తగా 1,802 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరింది. తాజాగా 9 మంది కోవిడ్‌ వ్యాధిబారినపడి చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. తాజాగా 2,711 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్​కేసుల సంఖ్య 31,635 ఉంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు […]

Read More
‘అభివృద్ధి'కి ఖర్చు చేయట్లే..

‘అభివృద్ధి’కి ఖర్చు చేయట్లే..

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) ను పూర్తిగా ఖర్చు చేయట్లేదు. మూడేళ్లుగా వారికి ఇస్తున్న నిధులను పూర్తిగా వినియోగించడం లేదని, గత ఆర్థిక సంవత్సరం అయితే సగం కూడా ఖర్చు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ కోరిన సమాచారం మేరకు ప్రభుత్వం వీటిని వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్), సీడీఎఫ్ కింద ఎమ్మెల్యేలు, […]

Read More

విలేజ్​ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఫోన్

సారథి న్యూస్​, హైదరాబాద్​: సీఎం కేసీఆర్ ఓ పంచాయతీ కార్యదర్శితో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. వ‌రంగ‌ల్ జిల్లా పర్వతగిరి మండ‌లం ఏనుగ‌ల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన రమాదేవికి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇంటి పన్నుల నిర్వహణ, ఇండ్లకు అనుమతుల జారీ, ఇంటి యజమాని పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేత‌ర భూమిగా మార్చడం త‌దిత‌ర అంశాల గురించి ఆరా […]

Read More