Breaking News

TELANGANA

కేసులు 200 పైనే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యారు. మహమ్మారి బారినపడి నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 191 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,406కి చేరింది. 3,027 మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో ప్రసుత్తం 2,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్‌ 13, కరీంనగర్‌ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ అయ్యాయి. […]

Read More

కంగ్టిలో మోస్తరు వర్షం

సారథిన్యూస్, నారాయణఖేడ్: మెదక్​ జిల్లా కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులు క్రితం రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. వర్షం రాకపోవడంతో నిరాశలో ఉన్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో ఆశలు చిగురించాయి. పత్తి, కందులు, పేసర్లు, మినుములు, సొయా వంటి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Read More

కేసీఆర్​కు థ్యాంక్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: రైతుబంధు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్​కు.. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరికీ తక్షణమే రైతుబంధు నిధులు వారి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకే తొలి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ వానాకాలం సీజన్ కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. మరో రూ.1500 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్​ కరోనా విపత్తుల్లోనూ వ్యవసాయరంగానికి రూ. 7 వేల […]

Read More

18 న ఇంటర్​ ఫలితాలు

హైదరాబాద్‌:  ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కాగా,  గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Read More
కరోనా @ 5,193

కరోనా @ 5,193

సారథి న్యూస్​, హైదారాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త 189 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,193కు చేరింది. తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 187 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 2,766 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రసుత్తం 2240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌ 2, రంగారెడ్డి […]

Read More

వారం పదిరోజుల్లో రైతుబంధు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఎకరా మిగలకుండా అందరికీ వారం పదిరోజుల్లో రైతుబంధు సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన వంటలను వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించిందని […]

Read More

మరో ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, నిజామాబాద్​ రూరల్​: కరోనా మహమ్మారి సామాన్య ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధులను వణికిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి పాజిటివ్ రాగా తాజాగా నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తాకు కరోనా వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల […]

Read More

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర […]

Read More