Breaking News

CARONA

సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరోనా విజృంభణ.. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పేద కుటుంబాలకు సోమవారం టీఆర్ఎస్ నాయకులు మచ్చ రమేష్, మిత్రుల సహకారంతో 25కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రవి, తాల్లపల్లి కరుణాకర్, దూస మురళి, దూస సతీష్, ఎనగందుల సాయికుమార్, తమ్మడి సంతోష్ పాల్గొన్నారు.

Read More
కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలపై ఎన్నారైలు తమ ఉదారత చాటుకున్నారు. పాలమూరు ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, తిమ్మాజిపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు పంపిణీ చేశారు. వైద్యసిబ్బంది, ఆశావర్కర్లకు మాస్కులు, పీపీఈ కిట్స్, థర్మల్ స్కానర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ తో పాటు ఇతర పరికరాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజికసేవ అందరికీ […]

Read More
టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న సమమయంలో పేదలు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ అధినేత తోట రాంకుమార్ ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంక్వయిరీ టీంసభ్యులు కూడా అన్నివేళలా సహకరిస్తున్నారని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు.

Read More
కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

సారథి, జగిత్యాల రూరల్: నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు కొవిడ్ పేషెంట్లకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, రురల్ మండల కోశాధికారి మెడపట్ల లక్ష్మణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పడిగెల మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగ మధుకర్ రెడ్డి, […]

Read More
అన్నదానం గొప్పకార్యం

అన్నదానం గొప్పకార్యం

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ విధించడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు నిత్యన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి. నిత్యన్నదానం పై ఆధారపడి కడుపు నింపుకునే పేదలు, యాచకులు ఆకలితో విలవిల్లాడుతున్న నేపథ్యంలో శనివారం 250 మందికి జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే పండ్లు, పౌష్టికాహారం ఆహారం అందజేసి వారిని అభినందించారు. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ […]

Read More
ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి […]

Read More
సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ […]

Read More