చిరునవ్వు తో మెస్మరైజ్ చేయడం, అభినయంతో అందరినీ ఫిదా చేయడం సమంతకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎవరూ ఊహించని రీతిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రంగస్థలం’లో లక్ష్మి పాత్రలో కొంటెగా కవ్వించింది.. ‘మజిలీ’ లో మంచి భార్యగా మెప్పించింది.. ‘ఓ బేబీ’లో 20 ఏళ్ల ఆడపడుచుగా అందరినీ అలరించింది. ఇలా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించే సామ్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో టెర్రరిస్ట్ గా నెగిటివ్ రోల్లో కనిపించనుంది. అయితే మరో […]
అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ […]
గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారు. నారాయణదాస్, పుస్కూరి రామ్మోహన్రావు, శరత్ మారార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా గోవాబ్యూటీ ఇలియానా ఎంపికైనట్టు సమాచారం. ఇలియానా టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆమెకు నాగార్జున తన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు దర్శకుడు కూడా ఒప్పుకోవడంతో ఇలియానాకు ఆఫర్ […]
తన గెటప్స్‌తో క్యారెక్టర్‌కు ప్రాణం పోయడం కింగ్ నాగార్జున స్పెషాలిటీ. మేకోవర్ అవడంలో ఆయనకు ఆయనే సాటి. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులను ఎంపిక చేసుకునే కింగ్ ఈ సారి రైతుపాత్రను ఎంచుకున్నాడట. ఆల్రెడీ ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాల్లో పంచె కట్టు కట్టి రైతుగా కనిపించినా ఈసారి మాత్రం పక్కా రైతుగా దర్శనమివ్వనున్నాడట అక్కినేని అందగాడు. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ ఎన్ఐఏ అధికారిగా కనిపించనున్నాడు. అయితే […]