సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కోరారు. ఆగస్టు 7లోగా డీఈవోలకు అప్లికేషన్స్ పంపించాలని సూచించారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్లకు రెండు అవార్డుల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత డీఈవో ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.