సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: గుండెపోటుతో చిన్నశంకరంపేట సహకార సంఘం వైస్ చైర్మన్ గుడికాడి కిష్టగౌడ్(56) సోమవారం మడూర్ గ్రామంలోని తన నివాసంలో కన్నుమూశారు. గతంలో చైర్మన్ పదవిలో కొనసాగిన తిగుళ్ల బుజ్జి మరణించడంతో ఇన్చార్జ్ చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన మరణంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. కిష్టగౌడ్ మృతి పట్ల సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.
పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల సొసైటీ పరిధిలోని రైతులకు శనివారం పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డితో కలిసి సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వంద కిలోల బస్తా రూ.6,600 ఉండగా, రూ.4,290 సబ్సిడీ పోనూ రైతులు రూ.2,310 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిలుకూరి […]