సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్– 19 (కరోనా)కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ జె.నివాస్ గురువారం పరిశీలించారు. కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గం గుండా ఇతర వ్యాధిగ్రస్తులు రాకపోకలు సాగించకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జీజీహెచ్ లో 90 బెడ్లను ఐసోలేషన్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కూడా ప్రత్యేక వసతి ఉండాలని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ సరఫరా చేయాలని […]