స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతారలంతా దిల్ రాజు సదనానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయనతో అందరికీ అవసరమే మరి. ఈ వేడుక పక్కన పెడితే అభిమాన హీరోలంతా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా కనిపించడంతో ఫ్యాన్సంతా యమ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోలను షేర్ చేసే సందడిలో పడ్డారు. వాళ్లెవరో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
అవును ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య ఎక్కడినుంచి మొదలు పెట్టాలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్త్రీ లోకం కోసం మాట్లాడేందుకు ఎన్నో శ్లోకాలు. ‘యత్రనారీయంతు..’ అంటూ కోకొల్లలు. ఇక మన శక్తిమంతులైన దేవతామూర్తులంతా మాతృస్వరూపులే. వారికి మొక్కని రోజు ఉండదు. కోరని వరాలు ఉండవు. ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గ, కాళికా, చండిక.. ఒక్కరేమిటి లెక్కకు మిక్కిలి. మరి అన్ని శక్తులను అమ్మరూపంగా ఆరాధిస్తున్న మనం ఆడపిల్లల పట్ల చూసే చూపులోనే తేడా వస్తోంది ఎందుకు. […]