చెన్నై: ప్రముఖ సంగీతదర్శకుడు ఏ ఆర్రెహ్మాన్.. మరోసారి వార్తల్లో నిలిచారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయపు పన్నుశాఖ ఆరోపిస్తున్నది. 2012లో రెహ్మన్ బ్రిటన్కు చెందిన టెలికాం అనే ప్రైవట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ ఒప్పందం విలువు రూ. 3.47 కోట్లు అయితే దీనికి రెహ్మన్ పన్ను చెల్లించలేదు. దీంతో ఆదాయపుపన్నుశాఖ కోర్టును ఆశ్రయించింది. దీంతో శుక్రవారం మద్రాస్ హైకోర్టు రెహ్మన్కు నోటీసులు జారీచేసింది. […]