ముంబై: వివాదాస్పద బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]
కొంతకాలంగా బాలీవుడ్ నటులపై అక్కడి డ్రగ్మాఫియాపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబై సిటీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా కామెంట్ చేసింది. కాగా కంగనా ఆరోపణలపై శివసేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘కంగనాకు ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ఆమె ముంబై రావొద్దు. కానీ ఇక్కడి ప్రభుత్వం, పోలీసులపై ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం శివసేన ఆమెను క్షమించదు. కంగనాను […]
బాలీవుడ్ డ్రగ్మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్‌కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]
ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని […]
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్ వేశారు. స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్ డిజాస్టర్. […]
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై: కరోనా వ్యాప్తి చెండటంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాపించిందని అన్నారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. ఎలాంటి ప్లాన్ లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసే బాధ్యతను మాత్రం రాష్ట్రలపైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని […]