న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం ఎప్పటికీ కాదని సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం స్పష్టంచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారని, ఇస్రో ప్రైవేట్‌పరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను.. అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేట్‌వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు […]