తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి […]