సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆర్జీ –1 జీఎం కె.నారాయణ మంగళవారం ప్రారంభించారు. మొదటి దఫాలో ప్రభుత్వం సూచన మేరకు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు.