సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.