సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద […]