ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన […]
సారథి న్యూస్, హుస్నాబాద్: విప్లవ రచయితల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ లోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా […]
సాహితీ శిఖం శ్రీశ్రీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యారు. విప్లవకవి, సంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా సుప్రసిద్ధులు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు, మహాకవిగా విశేష గుర్తింపు పొందారు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో సుప్రసిద్ధమైంది. పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు 1910 ఏప్రిల్ 30న శ్రీశ్రీ జన్మించారు. 1910 సంవత్సరం […]