సారథి, ఖమ్మం: భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సంకల్ప సభ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి తల్లి విజయమ్మతో కలసి షర్మిల భారీ కాన్వాయ్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబర్ 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. […]