తిరువనంతపురం: భారత్‌లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్‌లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]