Breaking News

వాజేడు

ముమ్మరంగా వాహనల తనిఖీలు

ముమ్మరంగా వాహనల తనిఖీలు

సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.  ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.

Read More
అట్టహాసంగా ‘అక్షర భారత్’ ప్రారంభం

అట్టహాసంగా ‘అక్షరభారత్’ ప్రారంభం

సామాజిక సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో అభి హెల్ప్​లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో కొనసాగుతున్న అక్షర భారత్ విద్యాకార్యక్రమాన్ని మండల కోఆర్డినేటర్ కార్తీక్, గ్రామ కోఆర్డినేటర్ పాయం అజయ్ ఆదివారం ప్రారంభించారు. వయోజనులందరికీ విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్​నాగలక్ష్మి, ఆశా కార్యకర్త సమ్మక్క, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
అభాగ్యుడిపై ‘అమ్మ’ప్రేమ

అభాగ్యుడిపై ‘అమ్మ’ప్రేమ

సామాజిక సారథి, వాజేడు: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆర్థిక సహాయం అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ రెండేళ్లుగా ఎర్రరక్తకణాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యచికిత్సల కోసం రెండెకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు. మూడు రోజుల క్రితం వరంగల్ లోని లలిత ఆర్థోపెడిక్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లాడు. బిల్లు కట్టలేని పరిస్థితుల్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించాడు. స్పందించిన […]

Read More
సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో […]

Read More
గణపురంలో వైద్యపరీక్షలు

గణపురంలో వైద్యపరీక్షలు

సారథి, వాజేడు: ములుగు జిల్లా మూరుమూరు పంచాయతీ గణపురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యమున గ్రామంలో బాలింతలు గర్భిణులు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, సర్పంచ్, సెక్రటరీ, వైద్యసిబ్బంది కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశా కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.

Read More
విషజ్వరంతో బాలుడి మృతి

విషజ్వరంతో బాలుడి మృతి

సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు రాకేష్(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని మండలంలోని ప్రగళ్లపల్లిలో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వాజేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Read More
కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ […]

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన తోట భాస్కర్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత కలసి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More