చెన్నై: తన కెరీర్ మొత్తంలో 1999లో జరిగిన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. దాదాపు 10ఏళ్ల విరామం తర్వాత, భారత్– పాక్ టెస్ట్ సిరీస్లో మ్యాచ్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘ఆ పర్యటనకు నేను కెప్టెన్ను. చెన్నైలో తొలి టెస్ట్. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా.. మేం బాగా ఆడాం. దీంతో మ్యాచ్ గెలిచాం. ఇండో–పాక్ చరిత్రలో ఇదే తొలి విజయం కావడంతో మా ఆనందం రెట్టింపు అయింది. […]