సారథి న్యూస్, నాగర్ కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. మండలాల వారీగా కలెక్టరేట్లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్వీఎస్ ఆస్పత్రికి […]
వలస కార్మికులకు చేయూత.. జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లో.. సారథి న్యూస్, నర్సాపూర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లోని వారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న కూలీలకు బుధవారం శివ్వంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ సభ్యుడు మహేష్ గుప్తా తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.రెండువేల నగదుతో పాటు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని జిల్లాకు వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ.500 కచ్చితంగా పంపిణీ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6069 మంది వలస కూలీలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వలస కార్మికులంతా జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు, ఇటుక బట్టీల్లో […]