సారథిన్యూస్: అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన ఆఫీసులోనే పనిచేసే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రేమను.. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని లోకాంటో అనే యాప్లో యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. దీంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ టెకీ కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ కు చెందిన అందె వంశీ(25) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. […]