సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]