యువతిపై కేసునమోదు సారథి న్యూస్, రామడుగు: ప్రియుడి స్నేహితురాలి పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్ సృష్టించిన ఓ యువతిపై రామడుగు పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు యువతి స్థానికంగా ఓ షాపులో పనిచేస్తోంది. అదే దుకాణంలో పనిచేస్తున్న సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని యువతి.. ప్రియుడి ద్వారా ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకుని నకిలీ పేస్ బుక్ […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి అనుబంధ గ్రామం మామిడిచెట్టిపల్లి పరిసర పంటపొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అర కిలోమీటర్ మేర వ్యాపించాయి. సమీప రైతులకు చెందిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. వ్యవసాయ బోరుబావుల వద్ద కరెంట్ తీగలు కూడా కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో పది మంది లబ్ధిదారులకు రూ.10,01,160 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, పలు గ్రామా సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.