సారథి న్యూస్, రామడుగు: ప్రతి మండలంలోనూ మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్ లోని లక్ష్మీ గార్డెన్ లో ఆరో విడత హరితహారంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో హరితహారం చేపట్టామని తెలిపారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో […]