Breaking News

మే డే

కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్​సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల […]

Read More
కార్మికులు ఏకం కావాలె

కార్మికులు ఏకం కావాలె

– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ సారథి న్యూస్​, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్​ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్  వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను […]

Read More
పేదలను ఆదుకోవాలి

పేదలను ఆదుకోవాలి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా  కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్​ నగర్​ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
ఘనంగా మే డే వేడుకలు

ఘనంగా మే డే వేడుకలు

ఎగిరిన అరుణపతాకం సారథి న్యూస్, రంగారెడ్డి : మేడేను పురస్కరించుకుని తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి టి.నర్సింహ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు బి.శంకరయ్య సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ పని గంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని తమ హక్కుల సాధనం కోసం జరిపిన పోరాటంలో పెట్టుబడిదారుల చేతుల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా […]

Read More