న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల […]