సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]