సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలంలోని పామునూరు అటవీప్రాంతంలో మంగళవారం పేలుడు సామగ్రిని అమర్చుతూ కనిపించిన ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్జీ పాటిల్వెల్లడించారు. వారి నుంచి మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ లు, వైర్, బ్లేడ్ లు, కత్తులు, గొడ్డళ్లు, బాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.