సామాజికసారథి, నాగర్ కర్నూల్: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా […]