సారథి న్యూస్, కర్నూలు: దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహానుభావుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ కొనియాడారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో కాంగ్రెస్ ఆఫీసులో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా […]
సారథి న్యూస్, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లో […]