టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. #HBDMaheshbabu అనే హాష్ ట్యాగ్ పేరుతో గత 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ఇంకా ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మహేశ్‌బాబు ట్విట్టర్లో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారని మహేశ్‌బాబు అభిమాన సంఘాలు చెబుతున్నాయి.