సారథి న్యూస్, మహబూబ్ నగర్: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన వట్టెం ప్రేమలత అనే మహిళ(35) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బావిలో పడిన సమయంలో ఆమెను స్థానికులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, మృతురాలి భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.