సారథి, పెద్దశంకరంపేట: ఎంపీపీ నిధులను ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆదివారం వినతిపత్రం అందజేసినట్లు ఎంపీపీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజాపరిషత్ కు కేటాయించిన 15 ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఇప్పటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రికి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు […]
సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]
సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే […]