సారథి న్యూస్, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.
సారథి న్యూస్, దుబ్బాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని మల్లన్న సాగర్ జలాశయ పనులను పరిశీలించి, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ మొదటి వారంలోగా పనులు పూర్తవాలని ఆదేశించారు. పనుల్లో క్వాలిటీ ఉండాలని సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ కాలనీ అంశంపై అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ తో చర్చించారు. […]