మే 22న భాగ్యరెడ్డి వర్మ జయంతి శతాబ్దాల పర్యంతపు చావు డప్పుల వెనుక.. శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనం, గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలిచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయన సొంతం. ప్లేగు, కలరా వంటి భయంకర అంటువ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవాదళ్ సంస్థను ఏర్పాటుచేసి ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల కాపాడేందుకు వైద్యసేవలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. […]