సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ భాగ్యనగరంలో మరోసారి భారీవర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోసారి అవకాశాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వారిని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటుచేసిన షెల్టర్లను తరలించాలని ఆదేశించారు.
జలదిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం నిండుకుండలా హుసేన్సాగర్, హిమాయత్‌సాగర్ భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో కరెంట్ కట్ ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం హైదరాబాద్– విజయవాడ హైవేపై రాకపోకలు బంద్ :: ఆర్కే, సారథి న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతోంది.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది.. అడుగు బయటికేస్తే ఎక్కడి డ్రెయినేజీలో కొట్టుకుపోతావేమోనన్నభయం వెంటాడుతోంది.. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయి అంధకారం అలుముకుంది. ఏ ఇల్లు చూసినా చెరువును తలపిస్తోంది.. వరద నీటితో […]